బిగ్ బాష్ లీగ్ లో ఆడనున్న ధోని...

బిగ్ బాష్ లీగ్ లో ఆడనున్న ధోని...

ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్ 3వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఒక్కో టీమ్‌లో ముగ్గురు విదేశీ క్రికెటర్లకు ఆడటానికి ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఐపీఎల్‌లోొో ఒక్కో జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఆడటానికి ఛాన్స్ ఉంది. ఇదే తరహాలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం వల్ల విదేశీ క్రికెటర్ల సంఖ్య ఈ సారి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ సారి భారత్ నుంచి కొంతమంది సీనియర్లు, మాజీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

బీబీఎల్ టోర్నమెంట్లలో ఆడటానికి టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌కు ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. కానీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన యువరాజ్ సింగ్, సురేష్ రైనా  కూడా బీబీఎల్‌ పై కన్నేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్ వంటి మరికొందరు క్రికెటర్లు బీబీఎల్‌లో ఆడటానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.