సీఎంతో కలిసి ఈల వేసి గోల చేసిన మిస్టర్ కూల్..

సీఎంతో కలిసి ఈల వేసి గోల చేసిన మిస్టర్ కూల్..

మిస్టర్ కూల్ ఏది చేసినా వెరైటీగా ఉంటుంది... తాజాగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌తో కలిసి ఈలలు వేస్తూ గోల చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. ఉల్లికాడలతో పదేపదే ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. జేఎస్‌సీఏ స్టేడియంలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం అందర్ని ఆకట్టుకుంది. ఈ స్టేడియంలో కొత్తగా సోలార్ విద్యుత్‌ వ్యవస్థ, అధునాతన హంగులతో కూడిన జిమ్‌, సీడీ ఫిట్‌నెస్‌ క్లబ్‌, అప్‌టౌన్‌ కేఫ్‌ నిర్మించారు. వీటిని సీఎం హేమంత్‌ ప్రారంభించారు. ధోనితో పాటు రాష్ట్ర క్రికెట్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేడియం కాంప్లెక్స్‌లో ఉన్న ఉల్లికాడలతో వీరిద్దరూ ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. మిస్టర్ కూల్‌ చిన్నపిల్లాడిలా ఉల్లికాడలతో ఈలలు వేస్తుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.