మ్యాచ్ పరిస్థితి బౌలర్ల కంటే ధోనీకే బాగా తెలుసు

మ్యాచ్ పరిస్థితి బౌలర్ల కంటే ధోనీకే బాగా తెలుసు

ధోనీకి మ్యాచ్ పరిస్థితులను ఆకళింపు చేసుకొనే సామర్థ్యం అద్భుతమని టీమిండియా చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వికెట్ల వెనుక నిలబడి బౌలర్ల కంటే బాగా మ్యాచ్ పరిస్థితిని విశ్లేషించడంలో ధోనీ నిపుణుడని చెప్పాడు.

స్టంప్స్ వెనుక ధోనీ ఉంటే బౌలర్ల పని చాలా సులువవుతుందని కుల్దీప్ తెలిపాడు. భారత్ కు రెండు ప్రపంచ కప్ లు సాధించిపెట్టిన ఎంఎస్ ధోనీతో కలిసి రాబోయే ఐసీసీ వరల్డ్ కప్ లో ఆడటం తన అదృష్టమని అంటున్నాడు.

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'స్పోర్ట్స్ తక్' తో మాట్లాడుతూ కుల్దీప్ 'మాహీ ఎప్పుడూ మా బౌలర్లకు మార్గదర్శనం ఇచ్చి సూచనలు చేస్తుంటాడు. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలని తనకు అనిపిస్తే చెబుతాడు. ఎప్పుడైనా వికెట్ కీపర్ మీకు ఇలా సహాయపడితే బౌలర్ల పని తేలికవుతుందని' చెప్పాడు.

'అప్పుడప్పుడు బౌలర్లు మ్యాచ్ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేక పోతారు. కానీ వికెట్ కీపర్ పరిస్థితిని బాగా తెలుసుకోగలుగుతాడు. మాహీ భాయ్ అలాగే చేస్తాడు' అని కుల్దీప్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.