పుట్టపర్తిలో మెరిసిన ధోని

పుట్టపర్తిలో మెరిసిన ధోని


అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి  మహాసమాధిని భారత్ క్రికెట్ మహేంద్రసింగ్ ధోని దర్శించుకున్నారు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో సత్య సాయి విమానాశ్రయం చేరుకున్నారు ధోని. అక్కడ నుంచి ప్రశాంతి నిలయం చేరుకున్న ధోనీకి ట్రస్టు సభ్యులు రత్నాకర్ ఘనంగా స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్య సాయి మహా సమాధి వద్ద  పుష్పగుచ్ఛాలు ఉంచి సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు ధోని. అనంతరం బాబా ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు.

అనంతరం సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కూడా సందర్శించారు. ఇక ప్రస్తుతం ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి రత్నాకర్ ని అడిగి తెలుసుకున్నారు. బాబా చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. సత్య సాయి బాబా ప్రపంచానికే ఆదర్శమన్న ధోని ఆయన సేవలను మరింత విస్తృతం చేయాలని ట్రస్ట్ సభ్యులను కోరారు. సత్యసాయి దర్శనార్థం పుట్టపర్తికి ధోని వచ్చాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనను చూడడానికి ఎగబడ్డారు.