ఐపీఎల్‌ ప్రచార వీడియో: ధోనీ వర్సెస్ కోహ్లీ

ఐపీఎల్‌ ప్రచార వీడియో: ధోనీ వర్సెస్ కోహ్లీ

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సమరం ముగిసింది. ఇక మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్‌కింగ్స్‌, రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌లో ఓ ప్రచార వీడియోను వదిలారు. ఈ వీడియోలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలు సందడి చేశారు.

'కోహ్లీ, కోహ్లీ.. ధోనీ, ధోనీ అని ఇరు జట్ల క్రికెట్‌ అభిమానులు అలరిస్తుండగా కోహ్లీ, ధోనీలు పైనుండి చూస్తుంటారు. అభిమానులను చూస్తే ఏమనిపిస్తోందని ధోనీని కొహ్లీ ప్రశ్నించగా.. ధోనీ, కోహ్లీ అనేవి పేర్లు మాత్రమే అని సమాధానమిస్తాడు. ఆట చూపిస్తా పదా అంటూ కోహ్లీ చాయ్‌ గ్లాసును చీర్‌కొట్టగా.. మార్చి 23న లేటుగా రావొద్దు అని చెప్పి ధోనీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కోహ్లీ నవ్వులు పూయిస్తాడు'. దీంతో ప్రచార ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రచార ప్రోమో అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఇక ఆలస్యం ఎందుకు మీరు చూసేయండి.