ధోని క్రికెట్ మొదట్లో ఏం అనుకున్నాడో తెలుసా...?

ధోని క్రికెట్ మొదట్లో ఏం అనుకున్నాడో తెలుసా...?

భారత మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కేవలం 30 లక్షల రూపాయలు సంపాదించి తన సొంత పట్టణం అయిన రాంచీలో ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు అని తన కెరీర్‌లో ముందు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న ప్రముఖ బ్యాట్స్‌మన్ "వసీం జాఫర్‌" ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 2007 టీ 20 ప్రపంచ కప్ మరియు 2011 వన్డే ప్రపంచ కప్ టైటిళ్లను కెప్టెన్‌గా భారతదేశానికి అందించిన ధోని ప్రపంచ క్రికెట్‌లో గొప్ప వ్యక్తి, అయితే ధోని జాఫర్ తో ఒకసారి ఈ విధంగా చెప్పాడట... "క్రికెట్ ఆడకుండా 30 లక్షలు సంపాదించాలని" అని అన్నాడు. "భారత జట్టులోకి తాను వచ్చిన మొదటి లేదా రెండవ సంవత్సరంలో, అతను క్రికెట్ ఆడకుండా 30 లక్షలు సంపాదించాలని కోరుకుంటున్నానని, అందువల్ల అతను రాంచీలో తన జీవితాంతంప్రశాంతంగా జీవించగలడని" అతను చెప్పాడు, అని జాఫర్ తన ట్విట్టర్ ఒక అభిమాని అడిగిన ప్రశ్న "ఎంఎస్ ధోనితో తన అభిమాన జ్ఞాపక ఏంటి..?" అని అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.