ఎంఎస్ ధోని ఇస్ బ్యాక్... 

ఎంఎస్ ధోని ఇస్ బ్యాక్... 

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లాక్ డౌన్ లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు, కానీ అతని భార్య సాక్షి ధోని మాత్రం తమ రాంచీ ఫామ్ హౌస్ నుండి ఎంఎస్ ధోని యొక్క ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే  ఉన్నారు. ఇంతక ముందు పోస్ట్ చేసిన వీడియోలో, ధోని ట్రాక్టర్ నడుపుతూ తన ఫామ్‌హౌస్‌లో పొలంలో దున్నుతున్నట్లు కనిపించింది. అలాగే సేంద్రీయ పద్ధతిలో పంట పండించడం నేర్చుకుంటున్నట్లు తెలిసింది!.ఇది చూస్తుంటే ధోని క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత వ్యవసాయం చేస్తాడేమో అని అంటున్నారు. అయితే అందులో ధోని నెరిసిన గడ్డంతో కనిపించాడు. ఇక ఇప్పుడు తాజాగా ధోనీ తన అభిమానులతో ఓ సెల్ఫీ వీడియో పంచుకున్నాడు. అందులో అందరికి హాయ్ చెప్తూ.. నవ్వుతున్నట్లు కనిపించింది. ఆ వీడియోలో ధోని మళ్ళీ నల్లని గడ్డంతో యంగ్ గా కనిపిస్తున్నాడు.  ఈ వీడియోని ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తాజాగా షేర్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ధోనీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి అభిమానులు అందరూ ధోని ఇస్ బ్యాక్ అంటూ కామెట్లు జత చేస్తున్నారు.