ధోనీ రిటైర్మెంట్‌పై చీఫ్‌ సెలెక్టర్‌ కామెంట్‌

ధోనీ రిటైర్మెంట్‌పై చీఫ్‌ సెలెక్టర్‌ కామెంట్‌

లెజెండరీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పందించాడు. 'రిటైర్మెంట్‌ అనేది ధోనీ వ్యక్తిగత విషయం. ఎప్పుడు రిటైరవ్వాలో ధోనీకి తెలుసు. వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండనని ముందే తెలియజేశాడు' అని చెప్పాడు ఎమ్మెస్కే. వరల్డ్‌కప్‌లో ధోనీ స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెస్కే మాట్లాడుతూ ఆ విషయంలో తమకు ఆందోళన లేదన్నాడు. ధోనీ తర్వాత ఎవరు.. అనే విషయమై తమకు క్లారిటీ ఉందన్న ఆయన.. రిషబ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతానికి మూడు ఫార్మాట్లలోనూ పంత్‌కు అవకాశం ఇస్తామని.. సాహా, కేఎస్‌ భరత్‌లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తామని చెప్పాడు.