సైబర్‌ పోలీసులకు ఎమ్మెస్కే ప్రసాద్‌ ఫిర్యాదు

సైబర్‌ పోలీసులకు ఎమ్మెస్కే ప్రసాద్‌ ఫిర్యాదు

ప్రముఖులకూ సైబర్‌ క్రిమినల్స్‌ బెడద తప్పడం లేదు. తాజాగా.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఫేస్‌బుక్‌ ఫేక్‌ అకౌంట్‌ను తెరిచారు గుర్తు తెలియని వక్తులు. ఎమ్మెస్కే ప్రసాద్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యేలా అందులో పోస్టులు పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన ఎమ్మెస్కే.. బీసీసీఐ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఫేక్‌ అకౌంట్‌ ద్వారా తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రసాద్‌ కోరగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.