రాయుడు '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ఏమన్నారంటే..

రాయుడు '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ఏమన్నారంటే..

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై ట్వీట్‌ చేయడంతోనే అంబటి రాయుడు క్రికెట్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడిందన్నది చాలా మంది ఒపీనియన్‌. వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కని రాయుడు.. '3డీ గ్లాసెస్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చూస్తా'నంటూ పంచ్‌ వేశాడు. త్రీ డైమెన్షన్స్‌లో విజయశంకర్‌ ఉపయోగపడతాడనే రాయుడు బదులు ఆయనకు అవకాశం ఇచ్చామని ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పడంతో '3డీ'ని బేస్‌ చేసుకుని రాయుడు ట్వీట్‌ చేశాడు. ఈ వ్యవహరం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పటి వరకూ ఈ విషయంపై నోరు మెదపని ఎమ్మెస్కే ఇవాళ స్పందించాడు. 

వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్లను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెస్కే.. ఆ ట్వీట్‌పై మాట్లాడాడు. 'రాయుడు ట్వీట్ చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేశా. మంచి టైమింగ్‌తో వచ్చిన ట్వీట్' అని అన్నాడు ఎమ్మెస్కే.  రాయుడు భావోద్వేగాలను అర్థంచేసుకున్నామన్న ఎమ్మెస్కే.. ప్రపంచకప్ కోసం నిష్పాక్షికంగా జట్టును ఎంపిక చేశామని వెల్లడించాడు. ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం ఉండవని.. ఎంపికలో తమకు కొన్ని ప్రమాణాలు ఉంటాయని అన్నాడు.  వీటన్నింటి ఆధారంగా ఎంపిక ఉంటుందని.. ఎవరైనా ఎంపకవపోతే పక్షపాతం ఉంటుందనుకోవడం సరికాదని ఎమ్మెస్కే అన్నాడు.