ఏపీకి కేసీఆర్ వస్తే ఆహ్వానిస్తాం..

ఏపీకి కేసీఆర్ వస్తే ఆహ్వానిస్తాం..

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఆహ్వానిస్తామన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం... ఏపీ సీఎం చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ మాటలను స్వాగతిస్తామన్న ముద్రగడ... చంద్రబాబుని సాగనంపే వరకూ విశ్రమించబోమన్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు సంతృప్తికరంగా లేదన్నారు ముద్రగడ పద్మనాభం.

ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు మరో లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం... బీసీలకు అదనంగా 5 నుంచి 10 శాతం కోటా పెంచాలని కోరారు. బీసీలకు కోరుకుంటున్నట్టుగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనయుడికి ఏ ప్రజలు చెబితే పదవులు ఇచ్చారో చెప్పాలి... ప్రజలు కోరుకుంటున్నవి మాత్రం చేయకుండా జాప్యం చేసి ఎగ్గొట్టాలని చూస్తారా? అంటూ మండిపడ్డారు. మహారాష్ట్ర తరహాలో రిజర్వేషన్లు అమలయ్యేలా కాపు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కోరిన ముద్రగడ... కాపు ఉద్యమ రాజకీయ భవిష్యత్ పై 23న కత్తిపూడిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.