సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖరాశారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం.. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ఆయన లేఖలో సీఎం జగన్‌ను కోరారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ... ఇప్పుడైనా రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను విజ్ఞప్తి చేశారు. ఉన్నత వర్గాల్లోని పేదలకు కేంద్రం ప్రభుత్వం కల్పించిన 10శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలయ్యేలా చూడాలని తన లేఖలో సీఎం జగన్‌ను కోరారు ముద్రగడ పద్మనాభం.