20వేల కోట్లు ఇస్తాం... సీఎం పదవి ఇస్తారా

20వేల కోట్లు ఇస్తాం... సీఎం పదవి ఇస్తారా

కాపు కార్పొరేషన్ కు 10వేల కోట్లు ఇస్తామన్న జగన్ చేసిన వ్యాఖ్యలను కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం తప్పుబట్టారు. 20వేల కోట్లు ఇస్తాం మా జాతికి సీఎం పదవి ఇస్తారా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. గుడివాడలో కాపు సేవా సమితి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... కాపు జాతి డిమాండ్లను పరిష్కరించిన పార్టీ పల్లకినే 2019లో మోస్తామని ముద్రగడ్డ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ లో పెట్టాలన్న పవన్ వాఖ్యలు స్వాగతిస్తామని తెలిపారు. జాతి ఆకలి తీరాలి తప్ప.. కేసులు ఎత్తివేస్తామని జగన్ దొంగ కన్నీరు కార్చడం విడ్డురమని విమర్శించారు. జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మాట్లాడటం దారుణమని విమర్శించారు. జగన్ ఒక్కో సభలో ఒక్కో లాగా మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన రిజర్వేషన్ హామీలను సీఎం అమలు చేయాలని కోరుతున్నామని ముద్రగడ్డ పద్మనాభం డిమాండ్ చేశారు.