ముకేష్ అంబానీ 'ఒకేఒక్కడు'..

ముకేష్ అంబానీ 'ఒకేఒక్కడు'..

టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో మనదేశం తరఫున ఎంపికైన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్తగా నలిచారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్ అంబానీ.. ప్రపంచవ్యాప్తంగా వందమంది అత్యంత ప్రభావశీలురలతో టైమ్‌ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన మార్గదర్శకులు, నాయకులు, దిగ్గజాలు, కళాకారులు, ఐకాన్లతో కూడిన ఈ ఏడాది జాబితాను బుధవారం విడుదల చేసింది టైమ్‌ మ్యాగజైన్‌. ఇక ఈ జాబితాలో ‘ఎల్‌జీబీటీక్యూ’ల హక్కుల కోసం మనదేశంలో పోరాడిన న్యాయవాదులు అరుంధతి కట్జు, మేనక గురుస్వామి కూడా చోటు దక్కించుకున్నారు. భారత మూలాలున్న అమెరికా కమెడియన్‌, టీవీ వ్యాఖ్యాత హసన్‌ మిన్హాజ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తదితరులున్నారు. కాగా, అరుంధతీ కట్జూ, మేనకా గురుస్వామి ఇద్దరూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారే. సామాజిక సమస్యలపై వీరిద్దరు చాలాకాలంగా పోరాడుతున్నారు. 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో రియలన్స్ అధినేత ముఖేష్‌ అంబానీతో పాటు ప్రముఖ న్యాయవాది అరుంధతి కట్జూ, ప్రముఖ సీనియర్ న్యాయవాది మేనకా గాంధీ ఉన్నా... ఈ జాబితాలో ఎంపికైన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్తగా నలిచారు ముఖేష్‌ అంబానీ.