జియో మరో సంచలనం..

జియో మరో సంచలనం..

జియో మొబైల్ సర్వీసులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ మరో సంచలనానికి తెరలేపింది. న్యూ ఇండియా.. న్యూ రిలయన్స్ పేరుతో దేశవ్యాప్తంగా నాలుగు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇంటర్‌నెట్ అప్ థింగ్స్, హోంబ్రాండ్, హోం బ్రాండ్‌బ్యాండ్, చిన్న, మధ్యతరగతి వ్యాపారాల కోసం బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు పెద్దపెద్ద వ్యాపారసంస్థల కోసం కూడా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రకటించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నాలుగు సర్వీసుల ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తామని రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు ముకేష్. హోం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ద్వారా గతంలో ఎప్పుడూలేని విధంగా ఇంటర్‌నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హోంబ్రాడ్‌బ్యాండ్ కోసం సెటాప్ బాక్స్ తీసుకుంటే ల్యాండ్‌ఫోన్, అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్, ఇంట్రాక్టివ్ గేమింగ్ కూడా పొందవచ్చు. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే సెకన్‌కు 1 జీబీ స్పీడ్‌తో డేటా పొందొచ్చు. దీంతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ సెటాప్ బాక్స్ ఉచితంగా లభిస్తాయి. జియో ఫైబర్ బేసిక్ స్పీడ్ 100 ఎంబీపీఎస్. జియో ఫైబర్ టారిఫ్ రూ.700 నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది.