2033 నాటికి అంబానీ ఆస్తి ఇలా పెరిగిపోనుంది..

2033 నాటికి అంబానీ ఆస్తి ఇలా పెరిగిపోనుంది..

ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్‌ అంబానీ ఆస్తి 2033నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరొచ్చని కంపారిజన్‌ అనే సంస్థ అంచనా  వేసింది. అప్పటికీ ఆయనకు 75ఏళ్లు వస్తాయని రిపోర్టు పేర్కొంది. బ్లూంబరర్స్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. అంబానీ ప్రస్తుత ఆస్తి 52 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. అంటే మన కరెన్సీలో 3.33లక్షల కోట్లు. ఆయిల్, పెట్రోకెమికల్, టెలికాం, రిటైల్‌ వ్యాపారాల్లో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఈ మధ్యనే ఈ-కామర్స్‌లోకి ప్రవేశించింది. 2014 చివరి నాటికి 21 బిలియన్‌ డాలర్ల స్థాయిలు ఉన్న అంబానీ ఆస్తి గడిచిన ఐదు సంవత్సరాలలో రెట్టింపయింది. జీయో 4G సేవలు ప్రారంభమయ్యాక రిలయన్స్ కంపెనీ సంపద దూసుకెళుతోంది. ఇక, ప్రస్థుతం 145 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్.. 2026 నాటికి తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నాడు.. అప్పటికి ఆయన వస్సు 62 ఏళ్లుకు చేరుకుంటుంది.. మన అంబానీ మాత్రం 75 ఏళ్ల వయస్సులో ఆ మైలురైయిని అందుకోనున్నారన్నమాట.