నాకు ఏకైక ఐకానిక్ లీడర్ మా నాన్నే-అంబానీ

నాకు ఏకైక ఐకానిక్ లీడర్ మా నాన్నే-అంబానీ

నాకు, నా జీవితంలో ఏకైక ఐకానిక్ లీడర్ నా తండ్రి ధీరూభాయ్ అంబానీయే అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముఖేష్ అంబానీ... ముంబైలో నిర్వహించిన ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో.. ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్‌గా పురస్కారం అందుకున్నారు ముఖేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జీవితంలో ఏకైక ఐకానిక్ లీడర్ నా తండ్రి ధీరూభాయ్ అంబానీయే అని వెల్లడించారు.. నా తండ్రి నాకు పెద్ద కలలు కనడం నేర్పించారు.. రిలయన్స్ కోసం పెద్ద కలలు కన్నాను, దేశం కోసం మరింత పెద్ద కలలు కన్నానని తెలిపారు... ఇక, నేను ఈ గుర్తింపును నా తండ్రి ధీరూభాయ్ అంబానీకి అంకితం చేస్తున్నాని ప్రకటించిన ఆయన.. యువ లీడర్లు ఎవరైతే గత దశాబ్దంలో కంపెనీ స్వరూపాన్ని మార్చారో వారికి ఈ పురస్కారం అంకితం ఇస్తున్నానని తెలిపారు.