పదేళ్ళ నుంచి ముకేష్‌కు అంతే జీతం

పదేళ్ళ నుంచి ముకేష్‌కు అంతే జీతం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ గత పదేళ్ళ నుంచి తన జీతంపై సీలింగ్‌ విధించుకున్నారు. కంపెనీ అధినేత ఆయన ప్రతి ఏటా రూ. 15 కోట్ల జీతం తీసుకుంటున్నారు. పదేళ్ళ క్రితం నాటి జీతం ఇది. ప్రతి ఏడాది తనకు ఇంతే జీతం చాలని, పెంచొద్దని ఆయన కోరడం, కంపెనీ అంగీకరించడం ఆనవాయితీగా మారింది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన ఇంతే తీసుకుంటున్నారు. జీతం, భత్యంతో పాటు ఇతర అలవెన్సులు, కమీషన్‌ కలిపి పదేళ్ళ క్రితం రూ.15 కోట్లయితే ఇప్పటి లెక్కల ప్రకారం ఆయన ఏటా  కనీసం రూ. 39  కోట్ల జీతం తీసుకోవచ్చు. కాని ఆయన రూ. 15 కోట్లకే పరిమితమైపోయారు.