సాయుధ దళాలతో ఆకాశ్-శ్లోకా పెళ్లి వేడుకలు

సాయుధ దళాలతో ఆకాశ్-శ్లోకా పెళ్లి వేడుకలు

అపర కుబేరుడు ముకేష్ అంబానీ, ఆయన భార్య నీతా తమ పెద్ద కుమారుడు ఆకాష్-శ్లోకా మెహతాల పెళ్లి వేడుకలను మంగళవారం ముంబైలోని కొత్తగా ప్రారంభించిన ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ లో సాయుధ దళాల కుటుంబ సభ్యులు, భద్రతా బలగాలతో కలిసి జరుపుకున్నారు. అంబానీ దంపతులు వేలాది సైన్యం, నౌకాదళం, పారా మిలటరీ బలగాల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ముంబై పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

‘ఈ నగరాన్ని, దేశాన్ని కాపాడే రక్షకులు మా వేడుకల్లో పాల్గొనడాన్ని మేము గౌరవంగా భావిస్తున్నాం. ఈ భావోద్వేగ, ఆనందకర సందర్భంలో ప్రతిరోజూ మనని సగర్వంగా తలెత్తుకొనేలా చేసే ఈ హీరోలు మా కోసం ఇక్కడికి వచ్చి ఆకాష్, శ్లోకాలపై ఆశీస్సులు కురిపించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోందని‘ నీతా అంబానీ చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ ప్రత్యేకంగా రూపొందించిన ‘అనంత ప్రేమ్‘ అనే ప్రత్యేక మ్యూజికల్ ఫౌంటెన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అజరామరమైన రాధాకృష్ణుల ప్రేమ గాథ రాస్ లీలాను గుర్తు తెచ్చేలా దీనిని రూపొందించారు.

ఆకాష్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను శనివారం పెళ్లాడాడు. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు హాజరయ్యారు.