బాంబుల మోత... స్వాతంత్ర్య దినోత్సవమే టార్గెట్..

బాంబుల మోత... స్వాతంత్ర్య దినోత్సవమే టార్గెట్..

వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ దద్దరిల్లిపోయింది... కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే.. ఇవాళ వరుసగా ఆరు చోట్ల పేలుళ్లు సంభవించాయి. బ్రిటీష్ పాలన నుంచి విమోక్తి పొంది వందేళ్లు అయిన సందర్భంగా ఆ దేశంలో వేడుకుల జరుగుతోన్న ఈ సమయంలో ఈ విధ్వంసం కొనసాగింది. ఆఫ్ఘన్‌లోని జ‌లాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జ‌రిగాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, ప‌బ్లిక్ ప్రాంతాల్లోనే ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 70 మంది వరకు గాయపడినట్టుగా తెలుస్తోంది.