బైక్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే సీతక్క కారు..

బైక్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే సీతక్క కారు..

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత సీతక్క ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. మంగపేట జీడివాగు దగ్గర  జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చిన్నారితో పాటు ఒక వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్టుగా తెలుస్తోంది. దీంతో గాయాలపాలైన చిన్నారి, వ్యక్తిని ఏటూరు నాగరం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.