డాన్స్ బార్ లో పట్టుబడ్డ 15 మంది అధికారులు 

డాన్స్ బార్ లో పట్టుబడ్డ 15 మంది అధికారులు 

ముంబయిలోని ఓ డాన్స్ బార్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సహా 15 మందిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో దక్షిణ  ముంబైలోని కొలాబాలో ఉన్న డాన్స్‌ బార్‌పై బుధవారం రాత్రి అకస్మిక తనిఖీలు నిర్వహిం‍చామని అన్నారు. హోటల్‌ యానమాన్యానికి చెందిన 9మంది, ఆరుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నాం. అరెస్టయిన వారిలో వ్యాపావేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. బార్‌లోని మహిళా సిబ్బందిని వదిలేశామని పోలీసులు మీడియాకు తెలిపారు.