ముంబై నెట్ బౌలర్ ఆత్మహత్య...

ముంబై నెట్ బౌలర్ ఆత్మహత్య...

ముంబై ప్రొఫెషనల్‌ జట్టుకు నెట్‌ ప్రాక్టిస్‌ బౌలర్ అయిన కరణ్‌ తివాతీ(27) అనే క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆటగాడు ముంబైలోని మలాద్‌ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటుగా దేశీయ మ్యాచ్ లు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరణ్‌ తన క్రికెట్‌ కెరీర్‌ లో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఆటగాడి  మృతి పట్ల నటుడు జితు వర్మ విచారం వ్యక్తం చేశారు. కరణ్‌ చాలా ఏళ్లుగా క్రికెట్‌లో ఎదగడానికి ప్రయత్నిస్తునాడు అని తెలిపాడు. అయితే ముంబై సీనియర్‌ జట్టులో చోటు కోసం కరణ్‌ చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయాడు. ఈ ఆటగాడిని అక్కడ నెట్స్  లో ముంబై డేల్ స్టెయిన్ అని పిలుస్తారు. కానీ జట్టులో మాత్రం స్థానం రాలేదు. అలాగే ఐపీఎల్ వేలంలో కూడా అతడిని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. ఈ కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది.