క్రికెటర్ దారుణ హత్య..

క్రికెటర్ దారుణ హత్య..

యువ క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బంధూప్‌ ప్రాంతంలో నిన్న రాత్రి స్థానిక క్రికెటర్ రాకేష్‌ పన్వార్‌ (30)ను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ హత్యా ఘటనపై రాకేష్‌ స్నేహితు గోవింద్‌ రాథోడ్‌ స్పందిస్తూ... రాకేష్‌ అతని ప్రియురాలితో ఉన్న సమయంలోనే  ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు. ఇక ఖాన్‌ అనే వ్యక్తి కుటుంబంతో రాకేష్‌కు శత్రుత్వం ఉందన్న గోవింద్.. వారే హత్యచేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ప్రేమ విషయం హత్యకు కారణమా? లేక శత్రుత్వమే హత్యకు దారితీసిందా? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.