సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ సెలబ్రేషన్స్

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ సెలబ్రేషన్స్

చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ సంబరాల్లో మునిగి తేలుతోంది. హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకొన్న ఆ జట్టు ఆటగాళ్లు.. నిన్న రాత్రి ముంబైలో అడుగుపెట్టారు. జట్టులోని ఆటగాళ్లను యాజమ్యానం ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగించింది. ఈ విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.