ముంబై చేతిలో కోల్‌కతా చిత్తు.. ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్..!

ముంబై చేతిలో కోల్‌కతా చిత్తు.. ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్..!

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చిత్తుచిత్తుగా ఓడింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో కనీస ప్రయత్నం చేయకుండా ప్లేఆఫ్‌ బెర్తును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు వదిలేసింది. గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే స్థితిలో ఆ జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో క్రిస్‌ లిన్‌ 41 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక 134 పరుగుల విజయలక్ష్మంతో బరిలోకి దిగిన ముంబై... రోహిత్‌ శర్మ 55 పరుగులు (నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ 46 పరుగులు (నాటౌట్‌)గా నిలవడంతో 16.1 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్ : గిల్‌ 9, లిన్‌ 41, ఉతప్ప 40, రాణా  26, రింకూ సింగ్‌ 4, నరైన్‌ 0 (నాటౌట్‌), డికాక్ డకౌట్.
ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్: డికాక్‌ 30; రోహిత్‌శర్మ 55 (నాటౌట్‌), సూర్యకుమార్‌ 46 (నాటౌట్‌)