ఐపీఎల్‌: బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్..

ఐపీఎల్‌: బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్..

ఐపీఎల్‌ 2019లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మరోవైపు గాయంతో బాధపడుతోన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో... సారథ్య బాధ్యతలను కీరన్ పొలార్డ్‌కు అప్పగించారు. ఇక రోహిత్ శర్మ స్థానంలో సిద్దేశ్ లాడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతోన్న మయాంక్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి రాగా, ముజీబ్ స్థానంలో హార్డస్ విల్జోయెన్ తిరిగి జట్టులో చేరాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడు గెలిచి.. రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలవ్వగా... పంజాబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి.. నాలుగు గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.