ఏడో ఓటమి.. ప్లేఆఫ్‌కు దూరం..!

ఏడో ఓటమి.. ప్లేఆఫ్‌కు దూరం..!

ఐపీఎల్ 2019లో వరుసగా ఆరు ఓటమిల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. మరోసారి పరాజయాన్ని చవిచూసింది. లీగ్‌ దశలో నిలువాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో డివిలీయర్స్ 51, అలీ 50 గౌరపదమైన స్కోర్లతో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి.. ముంబై ముందు 172 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై.. డికాక్ 40, హార్దిక్ పాండ్యా 37 (నాటౌట్) విజృంభణతో 19 ఓవర్లలోనే విజయాన్నందుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్: పార్థివ్ పటేల్ 28, విరాట్ కోహ్లీ 8, డివిలీయర్స్ 75, అలీ 50, స్టోయినిస్ 0, నాథ్ 2, నేగి 0, ఉమేశ్ 0 (నాటౌట్), సిరాజ్ 0 (నాటౌట్)

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌: రోహిత్‌శర్మ 28, డికాక్ 40, సూర్యకుమార్ 29, ఇషాన్ కిషన్ 21, కృనాల్ 11, హార్దిక్ 37 (నాటౌట్), పొలార్డ్ 0 (నాటౌట్)