ఐపీఎల్ ఫైనల్ః చెన్నై టార్గెట్ 150

 ఐపీఎల్ ఫైనల్ః చెన్నై టార్గెట్ 150

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ పోరులో ముంబయి ఇండియన్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు చెన్నై బౌలింగ్ దాటికి చేతులెత్తేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (29; 17 బంతుల్లో 4ఫోర్లు), రోహిత్‌ శర్మ (15; 14 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్య, హర్దిక్ పాండ్య, రాహుల్ చాహర్, మిచెల్‌ మెక్లెనగన్ త్వరత్వరగా పెవిలియన్ చేరారు. చివర్లో పోలార్డ్(41; 25 బంతుల్లో, 3ఫోర్లు, 3 సిక్సులు) దాటిగా ఆడటంతో 148 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్ 5, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్ చెరో 2 వికెట్లు తీశారు.