ఓపెనర్లను కోల్పోయిన ముంబయి

ఓపెనర్లను కోల్పోయిన ముంబయి

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్లను కోల్పోయింది. భారీ షాట్లతో విజృంభించి ఆడతున్న ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (29; 17 బంతుల్లో 4ఫోర్లు) శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్  రోహిత్‌ శర్మ (15; 14 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) దీపక్‌ చాహర్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్(7; 10 బంతుల్లో)‌, ఇషాన్‌ కిషన్‌(5; 13 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు ముంబయి 58/2 స్కోర్ చేసింది.