టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్-12 కీలక దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ కు అర్హత సాధించాయి. మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో భాగంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన ముంబై, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. చెపాక్‌ స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరుగునున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది.