ముంబయి టార్గెట్ః 132

ముంబయి టార్గెట్ః 132

ఐపీఎల్ సీజన్-12 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తారు. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేశారు. 
అంబటిరాయుడు ‌(42; 37 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్)గా నిలవగా ధోనీ(37; 29 బంతుల్లో 3ఫోర్లు) మాత్రమే రాణించారు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. తొలుత 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని మురళీవిజయ్‌(26; 26 బంతుల్లో 3ఫోర్లు), అంబటి రాయుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. ముంబయి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌ పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.