చెలరేగిన పంత్.. ముంబయి టార్గెట్ 214

చెలరేగిన పంత్.. ముంబయి టార్గెట్ 214

ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్లు యువ ఆటగాడు రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్‌ ను అందించాడు. ముంబయి వాంఖేడే స్టేడియంలో పరుగుల వరద పారించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి పృథ్వీ షా(7) కీపర్ డీ కాక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శిఖర్ ధావన్‌ (43), కొలిన్‌ ఇన్‌గ్రామ్‌ (4) రాణించారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ రెచ్చిపోయాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 213 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్‌లో మెక్లాగాన్ 3, బుమ్రా, హార్థిక్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు.