టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఢిల్లీ జట్టు నిరాశపరచగా.. ముంబయి ఇండియన్స్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుని ఈ సారి ఢిల్లీ బరిలోకి దిగుతోంది.