కోల్‌కత్తాను కట్టడి చేసిన ముంబయి బౌలర్లు

కోల్‌కత్తాను కట్టడి చేసిన ముంబయి బౌలర్లు

వాంఖేడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కత్తా తక్కువ పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్ లీన్(41; 29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప(41;47 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఇద్దరు మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్లందరు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ముంబయి బౌలింగ్ లో లషిత్ మలింగా 3 వికెట్లు, బుమ్రా, హార్దిక్ పాండ్య చెరో 2 వికెట్లు తీసి కోల్ కత్తాను కట్టడి చేశారు. ముంబయి రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎవిన్ లివీస్, బరీందర్ స్రాన్‌ల స్థానంలో ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లాగాన్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఇక మార్పు చేసింది. పియూష్ చావ్లా స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.