టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరాలని పట్టుదలతో ఉంది. ఇక ముంబయి గెలిస్తే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ముంబయి రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఎవిన్ లివీస్, బరీందర్ స్రాన్‌ల స్థానంలో ఇశాన్ కిషన్, మిషెల్ మెక్లాగాన్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఇక మార్పు చేసింది. పియూష్ చావ్లా స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.