రాజస్థాన్ రాయల్స్ టార్గెట్: 188

 రాజస్థాన్ రాయల్స్ టార్గెట్: 188

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ(47, 32 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్), క్వింటన్‌ డికాక్‌(81, 52 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు) మొదటి నుంచీ దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కి రోహిత్, డికాక్‌లు 96 పరుగులు జోడించారు. తర్వాత సూర్యకుమార్‌(16), కీరణ్‌పోలార్డ్‌ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. చివర్లో డికాక్‌, ఇషాన్‌ కిషన్‌(5) ఔటైనా హార్దిక్ పాండ్య(28, 11 బంతుల్లో 1ఫోరు, 3సిక్సులు) బౌండరీలతో చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.