టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తుండగా.. ముంబై ఒక మార్పు చేసింది. గాయంతో బాధపడుతున్న అల్జరీ జోసెఫ్ స్థానంలో లసిత్ మలింగా జట్టులోకి వచ్చాడు. వరుసగా ఆరు పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.