ముంబయి ఇండియన్స్ టార్గెట్: 172

ముంబయి ఇండియన్స్ టార్గెట్: 172

వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఏబీ డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్స్ లు)కు తోడుగా మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1 ఫోర్, 5సిక్స్ లు) రెచ్చిపోయారు. వీరిద్దరి భాగస్వామ్యంతో ముంబయి ఇండియన్స్‌కు 172 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. పార్థివ్‌ పటేల్‌ (28; 20 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), విరాట్‌ కోహ్లీ (8) తక్కువ స్కోర్లకే పెవీలియన్ చేరారు. ఏబీడీ ఆటతో బెంగళూరు 190 పరుగులు చేసేలా కనిపించింది. అయితే మలింగ వేసిన ఆఖరి ఓవర్లో డివిలియర్స్‌, అక్షదీప్‌ నాథ్‌ (0), పవన్‌ నేగి (0) వరుసగా ఔట్‌ కావడంతో కోహ్లీసేన 171/7కు పరిమితమైంది. 

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తుండగా.. ముంబై ఒక మార్పు చేసింది. గాయంతో బాధపడుతున్న అల్జరీ జోసెఫ్ స్థానంలో లసిత్ మలింగాను జట్టులోకి వచ్చాడు. వరుసగా ఆరు పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.