ముంబై ఇండియన్స్ లో కరోనా కలకలం...

ముంబై ఇండియన్స్ లో కరోనా కలకలం...

ఐపీఎల్ 2021 ఈ నెల 9 నుండి ప్రారంభం కానుండగా వరుసగా ఆటగాళ్లు కరోనా భారిన పడటం కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ, కేకేఆర్, బెంగళూరు జట్లలోనే ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రాగ ఇప్పుడు ఈ వైరస్ ముంబై ఇండియన్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ముంబై జట్టులోని ఆటగాడికి కరోనా సోకలేదు. వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో మిగిత జట్టులోని ఆటగాళ్లకు అందరికి కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కిరణ్ కూడా కరోనా లక్షలు ఏవి కనిపించడం లేదు అని.. అతను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు అని జట్టు యాజమాన్యం పేర్కొంది. ఇక ముంబై ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో కోహ్లీ స్నాతో తలపడనుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.