ఐపీఎల్ 2021 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ముంబై...

ఐపీఎల్ 2021 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ముంబై...

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆ జట్టులో సూర్య కుమార్ యాదవ్(56) అర్ధశతకంతో రెచ్చిపోగా కెప్టెన్ రోహిత్ శర్మ(43) పరుగులతో రాణించాడు. ఇక 153 పరుగుల మాములు లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కత ఛేజింగ్ ను బాగానే ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రానా(57), గిల్(33) తో మంచి స్టార్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఆటగాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ముంబై 10 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటే కేకేఆర్ మొదటి ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.