డ్రగ్స్ కు బానిసై అమ్మను చంపేశాడు..

డ్రగ్స్ కు బానిసై అమ్మను చంపేశాడు..

డ్రగ్స్ కు బానిసైన లక్ష్య సింగ్ అనే మోడల్ తన తల్లి చంపేశాడు. తల్లీకొడుకు మధ్య జరిగిన ఘర్షణలో తనకు తెలియకుండానే సునీతా సింగ్ ను బాత్ రూమ్ లోకి తోసేసి, చంపేశాడు. ఈ ఘటన ముంబయిలోని ఒషివారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ముందురోజు రాత్రి ఆర్థిక సమస్యల విషయంలో తల్లీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. కోపంతో తల్లిని బాత్ రూమ్ లోకి నెట్టాడు. తలకు వాష్ బేసిన్ తగిలి ఆమె చనిపోయింది. కానీ ఆ సమయంలో తల్లి చనిపోయిన విషయాన్ని లక్ష్య సింగ్‌ గమనించలేదు. ఆ తర్వాతి రోజు ఉదయం బాత్‌రూం తలుపు తెరవగానే తన తల్లి చనిపోయి ఉందని పోలీసులకు తెలిపాడు. లోఖడ్‌వాలా ఏరియాలో క్రాస్‌ గేట్‌ బిల్డింగ్‌లోని ఫ్లాట్ లో తనకు కాబోయే భార్యకూడా అక్కడే ఉంది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.