ముంబై ముందు కోల్‌కతా చిత్తు

ముంబై ముందు కోల్‌కతా చిత్తు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండోసారి ముంబై చేతిలో కోల్‌కతా ఓడిపోయింది. తొలుగ బ్యాటింగ్‌ చేసిన ముంబై జట్టులో కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (62: 21 బంతుల్లో 5x4, 6x6) చెలరేగడంతో  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో బెన్‌ కటింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో స్కోరు 200 మార్క్‌ దాటింది. 211 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో108 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ అవుటవడంతో ఆ జట్టు మరి కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా క్రిస్‌ లిన్ (21), ఉతప్ప (14), నితీశ్ రానా (21) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. గెలిపిస్తాడనుకున్న ఆండ్రీ రసెల్‌ 2 పరుగులకే అవుటవడం, డాషింగ్‌ హిట్టర్ దినేశ్‌ కార్తీక్‌ 5 పరుగులకే రనౌటవడంతో ముంబై విజయం లాంఛనమే అయింది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. మిగిలిన ఐదు మ్యచుల్లో కనీసం 4 మ్యాచులైనా గెలిస్తేనే కోల్‌కతా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.