పలాసలో విచిత్ర పరిస్థితి.. తలలు పట్టుకు కూర్చున్న ఎన్నికల అధికారులు !

పలాసలో విచిత్ర పరిస్థితి.. తలలు పట్టుకు కూర్చున్న ఎన్నికల అధికారులు !

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. దీంతో ఏమి చేయాలో తెలియక ఎన్నికల అధికారులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయానికి వస్తే పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం  31 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. 4 వ వార్డు మీసాల సురేష్ - వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 8వ వార్డు పిచ్చుక అజయ్ కుమార్ ఏకగ్రీవం విషయంలో టెన్షన్ నెలకొంది. అదేంటంటే  ఈ 8వ వార్డు డమ్మీ అభ్యర్థి వ్యవహారం టెన్షన్ పెడుతోంది. 8వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధి పిచ్చుక అజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అయితే 8వ వార్డుకు డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన పిచ్చుక విజయ్ కుమార్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు.

విజయ్ మృతి విషయం పై ఎన్నికల అధికారులకు వైసీపీ అభ్యర్థి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే 8వ వార్డు నుంచి పోటీలో ఉన్నవారు తప్పుకోవడంతో అజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ప్రకటించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. అదే విషయమై ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారని అంటున్నారు. మున్సిపల్ ఆఫీస్ తలుపులు మూసేసి లోపల అధికారులు చర్చించుకుంటున్నారని అంటున్నారు. ఏకగ్రీవం ఇవ్వాలో లేదో  అనే విషమై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని సమాచారం.