మున్సిపల్ లేబర్ కు కళ్లు తిరిగే ఆస్తులు

మున్సిపల్ లేబర్ కు కళ్లు తిరిగే ఆస్తులు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసే డి క్లాస్ ఎంప్లాయీ దగ్గర అక్రమాస్తులు గుట్టలుగుట్టలుగా ఉన్నట్టు గుర్తించారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అనుమానం రావడంతో అస్లమ్ ఖాన్ స్థావరాల్లో సోదాలు చేశారు. రూ. 4 కోట్ల అక్రమాస్తులు అస్లమ్ పోగేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఆయన ఇళ్లల్లో రూ. 22 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలే గాక ఒక్కోటి వంద గ్రాముల బరువున్న బంగారు బిస్కట్లు, రూ. 4 కోట్ల మేర స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, 2 లగ్జరీ ఫోర్ వీలర్లు, కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంక్ ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరి అకౌంట్లో కళ్లు తిరిగే డిపాజిట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. త్వరలోనే వాటిని ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. అస్లమ్ ఉద్యోగంలో చేరినప్పుడు నెలకు రూ. 500 ఉన్న జీతం ఇప్పుడు రూ. 18 వేలకు చేరింది.