టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే..

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే..

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయే అని పేర్కొన్నారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని తెలిపారు. ఉత్తమ్, కుంతియా వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఆరోపించారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళితే రాష్ట్ర నాయకత్వం స్పందించలేదని విమర్శించారు. రాహుల్ నాయకత్వం బలహీనపడిందని నాయకులు భావిస్తున్నారని తెలిపారు. నాయకత్వ లోపంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతైందని అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు అర్ధమవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.