మురళీమోహన్‌కు మాతృవియోగం

మురళీమోహన్‌కు మాతృవియోగం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, సినీ నటుడు మురళీమోహన్‌కు మాతృయోగం కలిగింది. మురళీమోహన్ మాతృమూర్తి మాగంటి వసుమతిదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 100 సంవత్సరాలు... ఇవాళ ఉదయం ఆమె తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వసుమతీదేవి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్‌ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించి ఓదార్చారు.