బెంగాల్ లో పెనుమార్పులు రాబోతున్నాయి

బెంగాల్ లో పెనుమార్పులు రాబోతున్నాయి

పశ్చిమ బెంగాల్ లో పెనుమార్పులు రాబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు, అధికారాలను మమత ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించారని... అమిత్ షా రోడ్ షోకు వచ్చిన ఆదరణను భరించలేకే హింసకు తెగబడ్డారని అన్నారు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా చంద్రబాబు స్థిరత్వం లేని భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

'ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబును ఆదరించడం లేదు. అందుకే మోడీని వ్యతిరేకించే వారిని కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఏ, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు పగటి కల. చర్చలకు పనికొస్తాయి తప్ప ముందుకు సాగవు. కమల్ హాసన్ మతిస్థిమితం తప్పి.. పేపర్లలో హెడ్ లైన్స్ కోసం మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడులో జనాదరణ పొందలేని కళాకారుడు కమల్ హాసన్. మతం ఆధారంగా ఉగ్రవాదాన్ని చర్చించడాన్ని బీజేపీ ఎప్పుడు సమర్ధించదు' అని మురళీధర్ రావు అన్నారు.