టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే...

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే...

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. బీబీనగర్‌లోని ఎయిమ్స్ స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు సిద్ధాంతాలపరంగా పెద్ద తేడా లేదని అన్నారు. ఈ రెండు పార్టీలూ కుటుంబ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైన్ మాఫియా టీఆర్‌ఎస్‌తో కలిసిపోయాయని అన్నారు.  బీజేపీ.. ఈ మాఫియాల భరతం పడుతుందని చెప్పారు. పవిత్ర క్షేత్రంలో వ్యభిచార కేంద్రాలు నడవటం సిగ్గుచేటన్న మురళీధర్‌.. ఎవరిని కాపాడటానికి కేసులో తత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. 

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన కానుక ఎయిమ్స్ అని మురళీధర్‌రావు అన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ముందడుగు వేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారుల విషయంలో కేవలం నాలుగేళ్లలో ఇంతగా చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని మురళీధర్‌ అన్నారు.