కాకినాడలో రెండు రూపాయల కోసం హత్య.. 

కాకినాడలో రెండు రూపాయల కోసం హత్య.. 

ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకు హత్యలు జరుగుతున్నాయి.  ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ... విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు.  దీనివలన జీవితాలను కోల్పోతున్నారు.  అతడు సినిమాలో చెప్పినట్టు వంద రూపాయల కోసం కూడా హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు.  

ఇదిలా ఉంటె, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ దారుణం జరిగింది.  రెండు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది.  సైకిల్ టైరుకు గాలి కొట్టి సువర్ణరాజు అనే వ్యక్తి డబ్బులు అడిగాడు.  రెండు రూపాయలు డబ్బులు అడిగినందుకు అప్పారావు అనే వ్యక్తి ఆవేశంతో రెచ్చిపోయి సువర్ణరాజును కత్తితో పొడిచాడు.  దీంతో సువర్ణరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సువర్ణరాజును కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.  దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.